కరోనా వ్యాక్సిన్ ప్రారంభం

      శనివారం నుంచి దేశవ్యాప్తంగా  కరోనా వ్యాక్సిన్ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా తెలంగాణలో   వ్యాక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైద్యాధికారులు.

     రేపు రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రంలో వ్యాక్సిన్ వేయడానికి సిద్దమైంది వైద్య శాఖ. ఇందులో బాగంగా హైదరాబాద్ లో గవర్నర్ తమిళసై సుందరరాజన్ నిమ్స్ లో, గాంధీ హాస్పిటల్లో మంత్రి ఈటల  వ్యాక్సినేషను ప్రారంభించనున్నారు.   రేపు ప్రతి సెంటర్ లో30 మందికి డోసులు  ఇస్తారు. మొత్తం సుమారు 4 వేల మందికి  వ్యాక్సిన్ వేయడం  జరుగుతుందని  హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు  చెప్పారు. వ్యాక్సినేషన్ వారంలో నాలుగు రోజులు ప్రతి సోమ, మంగళ  మరియు గురు, శుక్ర  ఈ నాలుగు రోజులు మాత్రమే  కోవిడ్ 19 వ్యాక్సిన్  ఉంటుందని రాబోయే రెండు మూడు వారాల్లో రాష్ట్రంలో ని మొత్తం 1213 సెంటర్లలో కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంచి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు.

ఇప్పటి వరకు వరకు 3లక్షల 15 వేల మంది హెల్త్ కేర్ వర్కర్లని కోవిడ్ సాఫ్ట్వేర్ లో వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.