కరోనాతో ఆటలోద్దు..

పేకాడారు కరోనా బారిన పడ్డారు

ఆష్టాచమ్మతో 31మందికి కరోనా

 

              లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి వద్ద టైమ్ పాస్ కావడం లేదంటూ కోందరూ ఆటవిడుపుగా తోచిన ఆటలు అడుతున్నారు. ఇది కాలక్షేపానికి భాగానే ఉన్నా బయటి వ్యక్తులతో ఆటలాడటం ప్రమాదమని చూసిస్తుంది. తెలంగాణలో సూర్యపేట.., ఆంద్ర ప్రదేశలో విజయవాడలో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. విజయవాడ కృష్ణలంకకు చెందిన లారీ డ్రైవర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చాడు. ఆయనకు కరోనా సోకిన విషయం తెలియదు. ఆ డ్రైవర్ ఇతరులతో పెకాట ఆడటంతో 24మందికి కరోనా వైరస్ సోకింది. విజయవాడ లో కేవలం ఇద్దిరి వల్ల 39మందికి కరోనా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.

 

                     ఇక తెలంగాణలోనూ ఇది పద్దితిలో 31మందికి ఒక్క మహిళ ద్వారా కరోనా సోకింది. డిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తితో కలిసిన మహిళ చుట్టు పక్కల వారితో టైం పాస్ కోసం ఆష్టాచమ్మా ఆడింది. దాంతో సూర్యాపేట్ జిల్లాలో 31మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.  లాక్ డౌన్ నేపథ్యంలో  ఇంట్లోబుద్దిగా ఉండమంటే చుట్టుపక్కల వారితో ఆటలాడారు. దాందో కరోనా కోరల్లో చిక్కుకున్నారు. సో ఇంట్లోనే ఉండండి. కరోనాతో ఆటలాడోద్దు.