కరోనా (డిల్లీ) కలకలం.

కరోనా కలకలం.

మత ప్రార్థనలకు వెళ్లిన వారికి వైరస్.

తబ్లిక్ ఏ జమాత్ కార్యక్రమానికి వెళ్లిన వారితో వ్యాప్తి.

                         

            లాక్ డౌన్ ద్వారా సమర్థవంతంగా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ కు కోత్త కష్టం వచ్చింది. డిల్లిలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లిన వారు కరోనా విస్తరణకు కారణం అవుతుంది. దేశ రాజదాని డిల్లిలో మార్చి 1 నుండి 15 వరకు  "తబ్లిగి ఏ జమాత్"   కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాలనుండి పలువురు మత పెద్దలు పాల్గోన్నారు. 3500మందికి పైగా ఈ కర్యాక్రమంలో పాల్గోన్నాట్లు తెలుస్తుంది.  కార్యక్రమం పూర్తి అయిన తరువాత దేశంలోని తమ తమ ప్రాంతాలకు వెళ్లడమే కాకుండా విదేశాలనుండి వచ్చిన వారు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత ప్రచారంలో పాల్గోన్నారు. దాంతో వివిధ ప్రాంతాల్లోని వారికి కరోనా వ్యాప్తి చెందుతుంది.

 

                    డిల్లిలో  నిజాముద్దీన్ తబ్లీగి మసిదులో పార్థనల్లో పాల్గోన్న వారు ఇళ్లకు వచ్చిన తరువాత వారి వారి కుటుంబ సభ్యులకు కూడా వైరస్ ను వ్యాప్తి చేశారు, తెలంగాణలో మొత్తం 1030మంది వరకు ఈ ప్రార్థనలకు వెళ్లినట్లు తెలస్తుంది, వీరిలో హైదరాబాద్ నుండి 600మంది పాల్గోన్నారు. ఇక  ఆంధ్ర ప్రదేశ్ నుండి కూడా 924 మంది జమాత్  కార్యక్రమంలో పాల్గోన్నారు.  దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కరోనా కేసులు సెరుగుతున్నాయి. 

 

                     డిల్లిలో  మర్కజ్  బిల్డింగ్ లో ఉన్న  వారు భారిగా కరోనా భారిన పడుతున్నారు.  మర్కజ్ బిల్డింగ్ లో ఉన్న వారి 20మందికిపైగా పాజిటివ్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు అనుమానితులు ఉండాగా కోందరికి పాజిటివ్ వచ్చింది. ఇతర ప్రాంతాల్లో కూడా చాలామందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది. డిల్లిలోని మార్కజ్ బిల్డింగ్ లో   ఉన్న వారందనికి క్వారంటైన్ కు తరలించారు  ఇతర ప్రాంతాల్లోని వారందనికి గుర్తించి క్వారంటైన్ కు తరలించే పనిలో ఉన్నాయి అధికార వర్గాలు..