ఒమైగాడ్.... ఒమైక్రాన్ 

                   ప్రపంచాన్ని మరోసారి కరోనా భయపెడుతుంది. దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి వేగంగా సాగుతుంది.   రోజు రోజుకు భూమ్మిద ఆంక్షలు పెరుగుతున్నాయి. అన్ని దేశాలు  ఒక్కొక్కటిగా కట్టడి చర్యలకు దిగుతున్నాయి.   ఎవరైనా దేశ సరిహద్దులు దాటి వస్తే చాలా వారికి  టెస్టులు చేస్తే అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే తమ ప్రాంతానికి ఏమైనా  వ్యాపించిందా..,   అనే  ఆందోళనలో ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు విమాన సర్వీసులను రద్దచేయ్యడం లేద కట్టడి చేయ్యడం వంటి పనులు చేస్తున్నాయి పలు దేశాలు.  ఇప్పటికే   అమెరికా, రష్యా, జపాన్‌, ఆస్ట్రేలియా వంటి అగ్ర దేశాలతోపాటు పలు చిన్న దేశాలు కూడా   ఆఫ్రికా దక్షిణ దేశాలతో విమాన  రాకపోకలను రద్దు చేసుకున్నాయి. మరోవైపు బ్రిటన్ జర్మనీ దేశాల్లో  ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి.  

క్వారంటైన్‌ తప్పనిసరి..

                దక్షిణాఫ్రిక దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా క్వారంటైన్ చేయ్యాలని నిర్ణయించాయి పలు దేశాలు.  ఒమైక్రాన్‌ కలకలంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలకు దిగుతున్నాయి. అయితే మన దేశానికి  ఏ దేశం నుంచి వచ్చినా.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి రాష్ట్ర ప్రభుత్వాలు.   ఇక దక్షిణాఫ్రికా దేశాలనుండి వచ్చిన వారిని  తప్పని సరిగా క్వారంటైన్‌లో ఉంచాలని ముంబై కార్పొరేషన్‌ డిసైడ్ చేసింది. కేరళ కూడా తగిన చర్యలు తీసుకుకుంటున్నట్లు ప్రకటించింది. 

             ఒమైక్రాన్  ముప్పు జాబితాలోని 9 దేశాల నుంచి వచ్చినవారికి టెస్టులు తప్పని సరి  చేయాలని కర్ణాటక, గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది.    ఒమైక్రాన్‌  వేగంగా వ్యాపించడంతో పాటు సులువుగా   ఉత్పరివర్తనాలకు లోనయ్యేలా ఉందని అమెరికా   వైద్యరంగ సలహాదారుడు డాక్టర్‌  ఫౌచీ అభిప్రాయపడ్డారు.   ఒమైక్రాన్‌ వెరియంట్ వ్యాప్తి ప్రపంచ దేశాలకు ఓ మేల్కొలుపు సంకేతమన్నారు సౌమ్య స్వామినాథన్‌.   

 

           మొత్తంగా  ఒమైక్రాన్ వెరియంట్ తో  చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అసవరం ఎంతైన ఉందనేది పరిస్థితిని చూస్తూంటే అర్థం అవుతుంది.