ఈ గెలుపు ప్రజలకు అంకితం - ఈటెల రాజేందర్.

కేసిఆర్ అహంకారాన్ని, డబ్బు సంచులను  బోందబెట్టారు.  ఈటెల రాజేందర్

 

కేసిఆర్ అహంకారాన్ని, డబ్బు సంచులను, బోందబెట్టి నన్ను గెలిపించారు హుజురాబాద్ ప్రజలు. వారికి శిరస్తూ వంచి దండం పెడుతున్న. వందలకోట్లు ఖర్చుచేశారు. లారీలకు లారీలకు మద్యం తెచ్చారు. అన్ని విధాల చిన్న చిన్న ఉద్యోగులను బెదిరించారు. ఒటుకు పదివేలు పంచారని ఆరోపణలు వచ్చాయి. ఒటు వేసే సమయంలో కూడా డబ్బులు పంచారు. ఇక్కడి అధికారులు.., పొలిసులు అందరూ ఎక పక్షంగా వ్యవహరించారు. అందుకే పబ్లీక్ ముందు డిసైడ్ అయ్యారు. ఇంతచిల్లర ఎన్నికలు దేశంలో ఎప్పుడు జరగకుండవచ్చు అన్నారు రాజేందర్. ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు రావద్దని కోరుకుటుంటున్నానన్నారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మంది వచ్చి నా గెలుపుకోసం పనిచేశారు. వారందరికి దన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఈటెల రాజేందర్. ఇంతటి అక్రమాలు జరుగుతున్న ప్రజలను చైత్యం చేయ్యడంలో ఇంకా కోంత లోపం ఉంది. కవులు కళకారులు మిడియా రాయలేదు చూపించలేదు. 

 

                  తెలంగాణ ఉద్యమ   ఆశయం అయిన నీళ్లు నిధులు నియామకాలకోసం పోరాటం చేస్తానని ప్రకటించారు ఈటెల రాజేందర్. ఇప్పటి కే ప్రభుత్వం ప్రకటించిన ధళిత బందు అందరికి అందాలి . ఇతర కులాల్లో ఉన్న వారిని కూడ ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. డబుల్ బెడ్ రూంఇళ్లు ఇవ్వాలి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్.