ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..

    భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తరణలో భాగంగా బహిరంగ సభల ఏర్పాటుకు ఆ పార్టీ నాయకత్వం సిద్ధమైంది. తెలంగాణలోనే మొదటి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రాతిపాదించింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించారు.

   ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు లక్షమందికి పైగా జన సమీకరణ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బహిరంగ సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. మొదట ఢిల్లీలో బీఆర్ఎస్ సభ నిర్వహించాలని అనుకున్నా.. అనంతరం సభ వేదిక ఖమ్మంకు మారింది. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఖమ్మం ఉంది. ఛత్తీస్ గడ్ లో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.