ఆదార్ లింక్ లేకుండా త్రాగునీరు ఇవ్వాలి....

ఆదార్ లింక్ లేకుండా త్రాగునీరు ఇవ్వాలి....

                   గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉచిత త్రాగునీటి పంపిణికి ఆదార్ తో లింక్ చేయ్యవద్దన్నారు సిపియం నగర కార్యదర్శి శ్రీనివాస్. దాంతో చాలా మందికి ఉచితంగా నీరు అందదన్నారు ఆయానా. సుందరయ్య విజ్నాన కేంద్రంలో ఆపార్టీ ఆద్వర్యంలో రౌండ్ టెబుల్ నిర్వహించారు.  ప్రభుత్వం త్రాగునీటిని అందరికి ఉచితంగా అందించాలన్నారు. చాలా మంది పేదలకు ఇళ్ల లేవని వారు అద్దె ఇల్లలో ఉన్నారని..., ఆదార్ అనుసందానం చేస్తే నీటిభారాన్ని ఇంటి యజమానులు వారిపై మోపే అవకాశం ఉందన్నారు. రెండు ఇళ్లు ఉన్నవారు తాము ఉంటున్న ఇంటికి  ఆదార్ లింక్ చేసుకుంటారని అద్దెకు ఇచ్చిన ఇంటికి మాత్రం అనుసందానం చేయ్యరన్నారు. ఇక అపార్టు మెంట్ లో ఉన్న నల్లా కనెక్షన్ కు ఎలా ఆదార్ అనుసందానం చేస్తారనే అంశంపై క్లారీటి ఇవ్వాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రతి కుటుంబానికి సరిపడినంత త్రాగునీటిని పంపణి చేయ్యాలన్నారు. బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోవారికి అధికంగా పేదలు నివశిస్తున్న ప్రాంతాల వారికి తక్కువ నీటి సరఫరా చేయ్యడం సరికాదన్నారు.