అర్హులంద‌రికీ బియ్యం, నగదు పంపిణీ

 అర్హులంద‌రికీ  బియ్యం, నగదు  పంపిణీ - మేయర్

            కరోనా నేపథ్యంలో పరిస్థితులను అధిగమించుటకు ప్రజలకు అండగా నిలిచి, అర్హులoదరికి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, నగదు  పంపిణీ సక్రమంగా జరిగే విదంగా సమన్వయంతో వ్యవహరించాలని న‌గ‌ర‌ మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.    జి హెచ్ ఎం సి కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి ఉప్పల్ శాసన సభ్యులు సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు, వాట‌ర్ వ‌ర్క్స్‌, పోలీస్, రెవిన్యూ, డిప్యూటీ కమీషనర్లుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడరు.  నిత్యావసర వస్తువులు విక్రయించే షాపులు, కూరగాయల  దుకాణాలు, మెడికల్ షాపుల వద్ద తప్పనిసరిగా శానిటైజర్ పాటు  సోషల్ డిస్టన్స్ పాటించేలా చూడాలని అదికారులకు ఆదేశాలు జారీ చేశారు.  నిబంధనలు పాటించని వారి లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేస్తుందని హెచ్చరించాలని సూచించారు. పండ్లు విక్రయించే వారు వ్యక్తులు కూడా గ్లోవ్స్, మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించుటకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య సమస్యలు వున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు చేయించాలని తెలిపారు. గత 8 రోజులుగా లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో చురుకుగా పాల్గొంటున్న శాసన సభ్యులు, కార్పొరేటర్లు, అన్ని విభాగాల  అధికారులను అభినందించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టుటకు అధికారులకు సహకరించాలని కార్పొరేటర్లును కోరారు.