అభాగ్యులను ఆదుకోండి...

 

               భాగ్య‌నగ‌రంలో బ‌రోసాలేన్ని బ‌తుకులెన్నో ...., ఆలాన పాల‌నా లేని జీవితాలెన్నో .......,  ఎండ‌కు ఎండుతారు....., వాన‌కు నానుతారు. రోడ్ల‌పైనే వారి జీవితం తెల్లారుతుంది.    ఎవ్వ‌రైనా వ‌స్తారా.....,  ఎదైనా చెయ్య‌క‌పోతారా అని ఎదురుచుస్తున్నారు కోంద‌రూ. అయితే దీనినే   మ‌రికోంద‌రు  వృత్తిగా మ‌ర్చుకున్నారు. యాచకులు లేని నగరంగా బెగ్గర్ ఫ్రి సిటి చేస్తామన్నారు బల్దియా అదికారులు. మొదట్లో కోంత చేసినప్పటికి ఇప్పుడు మళ్లి రోడ్ కూడళ్ల వద్ద యాచకులు పేరిగిపోతున్నారు. షల్టర్లు ఎర్పాటు చేస్తున్నామన్న అధికారులు చెతులేత్తేశారు. చలికాలం ప్రారంభమౌతున్న తరుణంలో యాచకుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. త‌ల్లి దండ్రులు దూర‌మై కోంద‌రూ....., బిడ్డ‌లు దూరం చేసిన త‌ల్లితండ్రులు కోంద‌రూ.  విది విక‌టించి మ‌రికోంద‌రూ........, అన్ని ఉన్నా ఆగమైన‌ మ‌రెంద‌రో యాచ‌కులుగా మారుతున్నారు. చిన్న‌తనంలో పని చేయ్య‌లేక‌......., వృద్దాప్యంలో ప‌ని చేత‌గాక అన్నామోరామ‌చంద్ర అంటూ అడుకుంటున్నారు.  చిన్న చిన్న ప‌ట్ట‌ణాల‌నుండి న‌గ‌రాల దాక ఎక్క‌డ చూసిన యాచ‌కులు క‌నిపిస్తున్నారు. కోంద‌రికి విధి విక‌టిస్తే......., మ‌రికోంద‌రూ బెగ్గింగే వృత్తిగా ఎన్నుకున్నారు.  ఎక్క‌డెక్క‌డినుండో బాగ్య‌న‌రం చేరిన యాచ‌కులు హైద‌రాబాద్లో పెద్ద సంఖ్య‌లో ఉన్నారు.  అస‌లు ఎవ్వ‌రూ నిజంగా క‌ష్టాల్లో ఉన్నారు......, ఎవ్వ‌రూ డ‌బ్బు సంపాద‌న‌ కోస‌మే య‌చ‌కులుగా మారుతున్నార‌నేది పేద్ద క‌న్ ఫ్యూజ‌న్.  

 

             న‌గ‌రంలో ఎకూడ‌లి ......, మ‌సిదు...., గుడి......., చర్చీ  ప్రదాన పబ్లీక్ పార్కులు ఎక్కడ  చూసినా ప‌దుల సంఖ్య‌లో యాచ‌లు క‌నిపిస్తారు.  ఒకరూ దీనంగా యాచిస్తే....., మ‌రోక‌రూ చంటి పిల్ల‌ల‌తో బెగ్గింగ్ చేస్తుంటారు.   ఇంకోక‌రూ జ‌బ‌ర్ ద‌స్తీగా డిమాండ్ చేస్తుంటారు. దీంతో న‌గర‌మంతా బెగ్గ‌ర్స్ బిగ్ ప్రాబ్లంగా  మారారు. వృద్దులు, వికలాంగులు ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద  రోడ్డుపైకి వ‌స్తారు. కూడళ్ల వద్ద సిగ్న్ ల్ ప‌డ‌గానే  ట్రాఫిక్ అంత‌రాయ‌మౌతున్నారు.  న‌గ‌రంలో యాచ‌కులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.   బ‌ల్దియాలోని యాచకుల‌పై గ‌తంలో   స‌ర్వే నిర్వ‌హించింది.  దింట్లో  మైండ్ బ్లాంక్   అంశాలు వెలుగుచూశాయి.   ఢిల్లీ, బీహార్ రాష్ర్టాల‌తోపాటు బొంబాయి  నుండి కూడా భిక్షాటన కోసం  హైదరాబాద్‌ నగరానికి అనేక మంది వస్తు‌న్న‌ట్లు తేలింది. ఇక వికారాబాద్‌, శంక‌ర్‌ప‌ల్లి‌, కాండీ, షాద్‌న‌గ‌ర్‌, చుట్టు‌ప‌క్క‌ల గ్రామాల‌నుండి న‌గ‌రానికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.    సికింద్రా బాద్, నాంప‌ల్లి, కాచిగూడా రైల్వే స్టేష‌న్ల‌తో పాటు......, ఇమ్లీబ‌న్, జూబ్లీ బ‌స్ స్టేష‌న్ల వ‌ద్ద చాలామంది యాచ‌కులు ద‌ర్శ‌న‌మిస్తుంటారు.  

 

                        హైదరాబాద్లో రోజు రోజుకు  పెరిగిపొతున్నారు యాచ‌కులు. అనాదికారిక లెక్క‌ల ప్ర‌కారం 10వేల‌పైగానే వీరు ఉంటార‌ని అంచ‌నా. రెండేళ్ల క్రితం జిహెచ్ఎంసి కోన్ని స్వచ్చంద సంస్థలు నగరంలోని బెగ్గర్స్ ను రిలిఫ్ కేంద్రాలకు తరలించాయి. వారు వందల మందిని చేరదీశారు. తర్వాత తెలంగాణ జైళ్ల శాఖ హైదరాబాద్ లో బెగ్గర్ ఫ్రి సిటి కార్యక్రమం చెపట్టింది. నగరంలో 6వేలకు పైగా యాచకులను గుర్తించి ఆనంద ఆశ్రమం కి వారిని తరలించారు.  అయితే కొందరికి పునారావాసం కల్పించడం... మరికొంత మందిని  వారి కుటుంబీకులకు అప్పజెప్పారు. ఎలాంటి  ఆధారం లేని వారికి మాత్రం  ఆనందాశ్రమంలో   వసతి కల్పించారు. అయితే జైళ్ల శాఖా డిజి వికే సింగ్ మారిన తర్వాత పరిస్థితిలో కూడా కోంత మార్పు వచ్చింది. కోన్ని ప్రాంతాల్లో పోలీసులు అడపాదడపా కొందరిని గుర్తించి ఆశ్రమాలకు తరలిస్తున్నారు.  ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇప్పుడు నగరంలో రోడ్లపై బెగ్గర్స్  క్రమ క్రమంగా పెరిగిపోతున్నారు. దాంతో మళ్లీ వీరి సంఖ్య నగరంలో  ఎక్కువైతుంది.  సిటిలో ఇలాంటి అభాగ్యులకు కష్టాలు తప్పడం లేదు. ఎండాకాలం ఎండకు ఎండుతూ.., వానాకాలం వానకు తడుస్తూ..., చలికాలం మరింతగా ఇబ్బందులు పడుతూ రోడ్ సైడ్ ..., ఫుట్ పాత్ లపై కాలం వెళ్లదీస్తున్నారు. నగరంలో సరిపడినన్ని నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తే ఇలాంటి వారికి కనీసం వసతి సౌకర్యం కలుగుతుంది. దాంతో  ఆ మేరకైనా ఇబ్బందులు తగ్గుతాయి.  మరోవైపు వేల కోట్లున్న బల్దియా  బెగ్గర్స్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఎప్పటికప్పుడు చెబుతున్న ఆచరణలో మాత్రం విఫలం అవుతూ వస్తుంది. ఇప్పటికైనా ఇ అంశంపై ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.