కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రంగం సిద్దం...

         

         కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నది. టీకా వేసేందుకు బల్దియా అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ఇవ్వనున్న విషయం అదికారులు బావిస్తున్నారు. అందులో భాగంగా  పారిశుధ్య కార్మికులకూ తొలి విడుతలోనే వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

       జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుధ్య కార్మికుల తో పాటు పారిశుధ్య సిబ్బంది, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే సిబ్బంది, స్వీపర్లు, చెత్త ప్లాంట్ల నిర్వహణలో పని చేసే ఆపరేటర్లు, కార్పొరేషన్‌ ఇంజినీర్లు, ఆస్తి పన్ను వసూలు చేసేవారు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే సిబ్బంది, చెత్త వాహనాలు, వాటర్‌ ట్యాంకులను నడిపే డ్రైవర్లు, వైకుంఠధామాల్లో పని చేసేవారు, నిర్వహణ సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు. వీరందరి జాబితా రూపకల్పనపై అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతోపాటు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. 

 

      ముందుగా టీకా అందేది వీరికే....

అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు 17
జోనల్‌ మెడికల్‌ ఆఫీసర్లు (హెల్త్‌) 01
శానిటేషన్‌ వర్కర్స్‌ 18,550
శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 948
శానిటరీ జవాన్స్‌ 284
శానిటరీ సూపర్‌వైజర్స్‌ 22
శానిటరీ ఇన్‌స్పెక్టర్స్‌ 06
హెల్త్‌ అసిస్టెంట్స్‌ 06
స్వచ్ఛ ఆటో టిప్పర్‌ డ్రైవర్స్‌ అండ్‌ హెల్ఫర్స్‌ 5,000
స్వచ్ఛ సీఆర్‌పీఎస్‌ 2,152
ఎస్‌డబ్ల్యూఎం ఇంజినీర్స్‌ 04
ట్రాన్స్‌పోర్టు ఇంజినీర్స్‌ 40
ట్రాన్స్‌పోర్టు డ్రైవర్స్‌ 995
ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ 548