బిల్లులు చెల్లించకుంటే పనులు చేయ్యం

 బిల్లులు చెల్లించకుంటే పనులు చేయ్యం

       తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు దర్నాకు దిగారు. చార్మినార్ జోన్ కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు కాంట్రాక్టర్లు...,  ఫిబ్రవరి 1వ తేది నుండి అధికారుల వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయాంటున్నారు. లక్షల రూపాల అప్పులు చేసి తాము పనులు పూర్తి చేసి బిల్లులు పెడితే తమకు బిల్లులు చెల్లించడం లేదని మండి పడుతున్నారు కాంట్రాక్టర్లు.  పేమెంట్ చేయ్యకుంటే వర్కు చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించకుంటే ఈ నెల 10వ తేదీ నుంచి పనులు నిలిపివేస్తామంటున్నారు.