జిహెచ్ఎంసిలో వందలకోద్ది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు..

 జిహెచ్ఎంసిలో వందలకోద్ది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు..

పది ఒట్లు దాటని వారు 74మంది..

100ఒట్లు దాటని వారు 430మంది..

500ఒట్లు దాటని వారు 607మంది..

  

                     గ్రేటర్ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల ఆలొచనకు  అందని తీర్పునిచ్చిన ఒటర్లు..., కోందర్ని అస్సలు పట్టించుకోలేదు.  ఇండిపెండెంట్లుగా బరిలో దిగిన చాలా మంది సింగిల్ డిజిట్ క్రాస్ కాలేకపోయారు. వంద ఒట్లు కూడా సాధించని వారు 4వందల మంది..., 5వందల ఒట్లు సాధించని వారు 6వందలకు పైగా ఉన్నారు. జంగం మెట్ డివిజన్లో ఒక అభ్యర్థికి ఒక్కఒటు కూడా రాలేదు. పోటిలో ఉండి డిపాజిట్లు కూడా సాధించలేని వారు వందల సంఖ్యలో ఉన్నారు.  గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ కు జరిగిన సాదారణ ఎన్నికల్లో హైదరాబాద్ ఒటర్ నాడిని పట్టలేకపోయాయి రాజకీయ పార్టీలు. అనేక వార్డుల్లో కోన్ని రాజకీయ పార్టీలు 500ఒట్లు కూడా సాధించలేకపోయాయి. అధికార పార్టీ ఆశించిన స్థానాలు సగానికి పడిపోయాయి. సిటి ఎన్నికల్లో టిఆర్ఎస్.. బిజేపి.., ఎంఐఎం.., కాంగ్రేస్.. తెలుగుదేశం.., జనసమితి వంటి పార్టీలతోపాటు లెప్ట్ పార్టీలు.., ఇండిపెండేట్లు బరిలోనిలిచారు.  

 

                        కోందరూ రాజకీయ పార్టీల టికెట్లు రాకా ఇండిపెండ్లుగా బరిలో ఉంటే మరికోందరూ  నేరుగా స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో దిగారు. ఇలా అన్నిపార్టీల అభ్యర్థులు 1120మంది బరిలో ఉన్నారు. అయితే ఇందులో 607మంది మందిక కనీసం 500ఒట్లు కూడా దాటలేదు.  ఐదు వందలనుండి 100 ఒట్లు సాధించిన వారు మరో 150 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. అంలే వీరందరూ డిపాజిట్ కోల్పోవడం ఖాయం.  ఇక పోటిలో నిలిచి 100ఒట్లు కూడా వేయించుకోలేని వారు  సంఖ్య 430వరకు ఉంది. అంతే కాదండోయ్ 10ఒట్లు కూడా సాధించలేని వారు 74మంది గ్రేటర్ పోరులో పాల్గోన్నారు. ఇందులో జంగం మెట్ డివిజన్ లో పోటిచేసిన రజినికాంత్   ఒక్కఒటు కూడా సాధించలేకపోయారు. అంటే తన ఒటు అఢివిజన్ లో ఉండకపోవచ్చు..., కాని అతనిని బలపర్చిన వ్యక్తి కూడా అతనికి ఒటు వేయ్యలేదనేది స్పష్టం అవుతుంది. ఇక మైలర్ దేవ్ పల్లిలో బిఎంపి పార్టీ నుండి పోటిలో ఉన్న  గిరిబాబు యాదవ్ కు ఒకే ఒక్క ఒటు వచ్చింది.  కోంద మంది అభ్యర్థులు.., 3.., 4..,  5.., ఒట్లు సాధించారు. కేవలం కుటుంబ సభ్యుల  ఒట్లు మాత్రమే వారికి పడ్డాయి.

 

                 సింగిల్ డిజిట్ ఒట్లు సాధించిన వారు  ఖైరతాబాద్ లో అత్యదికంగా 23మంది ఉండగా..., చార్మినార్ లో14మంది.., ఎల్బీనగర్ లో 12మంది..., శేరిలింగం పల్లిలో 10మంది..,  కుకట్ పల్లిలో 8మంది..., సికింద్రాబాద్ జోన్ లో 7మంది ఉన్నారు. ఇక వంద కంటే తక్కువ ఒట్లు సాధించిన అభ్యర్థులు.., చార్మినార్ లో 90మంది ఉండగా..., ఖైరతాబాద్లో 87మంది...,  సికింద్రాబాద్ లో 79మంది ఉన్నారు. ఇక 5వందల కంటే తక్కువ ఒట్లు సాధించిన వారు చార్మినార్ జోన్ లో అత్యదికంగా 145మంది ఉండగా..., ఖైరతాబాద్ లో 123మంది.., సికింద్రాబాద్ జోన్ లో  109 ఉన్నారు. పోటిలో ఉన్న అభ్యర్తులకు తక్కువ ఒట్లు సాధిస్తే...., అతి తక్కువ ఒట్ల మార్జిన్ తో ఒడిపోయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. హాయత్ నగర్ సర్కిల్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి కేవలం 32ఒట్లతో  ఒడిపోయారు. అయితే వారి కుమారుడు ఇండిపెండెంట్ గా బరిలో ఉంటే అతకి 39 ఒట్లు పడ్డాయి. అదే అతను బరిలో లేకుంటే ఈస్థానాన్ని టిఆర్ఎస్ కైవసం చేసుకునేది.  కోన్ని రాజకీయ పార్టీలు సైతం కోన్నిడివిజన్లలో 5వందల మార్క్ ఒట్లను కూడా దాటలేదు. దాంతో చాలా మంది ఈ సారి డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఎర్పాడింది. పలు డివిజన్లలో టిడిపి.., లెప్ట్ పార్టీలతోపాటు కాంగ్రేస్ కూడా పెద్దగా ఒటింగ్ ను సాదించలేకపోవడం గమనార్హం..